ఉత్తరప్రదేశ్‌ లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి పెంచుతూనే ఉన్నాయి, హత్రాస్‌లో నలుగురు ఉన్నత కులానికి చెందిన వారు... 19 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, దాడి చేసిన కేసును యుపి పోలీసులు నిర్వహించిన తీరుపై. కుటుంబం అనుమతి లేకుండా ఆమె మృతదేహాన్ని దహనం చేసిన తీరుపై మండిపడుతున్నాయి.

కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) యోగి ఆదిత్య రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఇక ఇదిలా ఉండగా, ఫోరెన్సిక్ పరీక్షల ప్రకారం హత్రాస్ కేసులో అత్యాచారం జరగలేదని ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపారు. "ఫోరెన్సిక్ నివేదికలో వీర్యం కనుగొనబడలేదు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇప్పటికే స్పష్టం చేసింది. పూర్తిగా తప్పుడు సమాచారం అని ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్పారు. శాంతిభద్రతలు దిగజారుతున్న కారణంగా ఘజియాబాద్‌లో న్యాయవాదులు చాలా మంది ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: