భారత్ చైనా సరిహద్దుల్లో వాతావరణం కాస్త సద్దుమనిగే అవకాశాలు కనపడుతున్నాయి. సరిహద్దుల్లో చైనా భారీగా బలగాలను మొహరించినా సరే త్వరలోనే వెనక్కు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం భారత్ సరిహద్దుల్లో తన సైనిక శక్తిని పెంచడమే అని అభిప్రాయ పడుతున్నారు. సరిహద్దుల్లో భారీ అత్యాధునిక యుద్ద టాంకర్లతో పాటుగా రాఫెల్ యుద్ద విమానాలను కూడా ఇండియా మోహరించిన సంగతి తెలిసిందే.

అటు త్రివిధ దళాలు కూడా యుద్ధం వస్తే ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా సరిహద్దులకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే రెండు దేశాల సైనికుల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెల 12 న రెండు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: