2020లో కూడా బలవంతుడు బలహీణుడిని అణగతొక్కుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమైన సమావేశానికి హాజరవడంలో అధికారులు ఇంత నిర్లక్ష్యమా అని ఆయన మండిపడ్డారు. జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని హెచ్చరించారు. ఎక్కువ సంఖ్యలో ఎస్సీ ఎస్టీ కేసులు పెండింగ్ లో ఉండడం బాధాకరం అన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు వెనుకాడకూడదు అని ఆయన స్పష్టం చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి