హజ్ యాత్రకు వెళ్ళే వారికి గుడ్ న్యూస్ చెప్పింది... తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఆన్లైన్ దరఖాస్తుల సౌకర్యాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఈ కార్యక్రమానికి ఈరోజు నాంపల్లి హజ్ భవన్ లో శ్రీకారం చుట్టారు. 18 సంవత్సరాలు పై బడిన వారు 60 సంవత్సరాల లోపల ఉన్న వారే ఈ దరఖాస్తులు చేసుకోవాలని హోం మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు
వచ్చే సంవత్సరం హజ్ యాత్ర కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచే వెళ్లే వసతులు ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ఇక హజ్ యాత్రకు ఇప్పుడు కరోనా కారణంగా చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. కరోనా దెబ్బకు ఇప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి