గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ విషయంలో యువత ఘోరంగా వెనుకబడి ఉన్నారు. వృద్దులు సహా అందరూ వచ్చి ఓటు వేస్తున్నా యువత మాత్రం పోలింగ్ బూత్ వద్ద కనపడలేదు. దీనితో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే వికలాంగులు, కాళ్ళకు దెబ్బ తగిలిన వాళ్ళు కూడా వచ్చిన ఓటు వేస్తున్నారు. అయినా సరే ఐటి ఉద్యోగులు యువత మాత్రం ఓటు వేయడం లేదు.

తాజాగా మంత్రి కేటిఅర్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి కాలు బాగాలేకపోయినా సరే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ వీడియో అక్కడ ఉన్న వాళ్ళు షూట్ చేసారు. పోలీసుల సహాయంతో వచ్చి ఓటు వేసి వెళ్ళారు. దీనిపై పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు. కాగా 30 శాతం పోలింగ్ ఇప్పటి వరకు నమోదు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: