ఏపీ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మూడో ద‌శ పోలింగ్ ప్రారంభం అయింది. నేటి ఉద‌యం ఆరున్నర గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు. ఈ ద‌శ‌లో 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు నేడు పోలింగ్ జరగనుంది.

మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. 19,553 వార్డులకు 43,162 మంది పోటీ పడుతున్నారు. ఈ మూడో విడత పోలింగ్‌లో మొత్తం 55.75 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులలో బ్యాలెట్‌ పత్రాల్లో తప్పులు దొర్లాయి.

ఇద్దరు అభ్యర్థులకు ఓకే గుర్తు ఉండడంతో తీవ్ర గందరగోళం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే మాడగులలోని 12,13 వార్డుల్లో పోలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక‌ చేసేదేమి లేక‌.. అధికారులు ఈ నెల 21న తిరిగి పోలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఓటు వేసేందుకు వ‌చ్చిన ఓట‌ర్లు వెనుదిరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: