బెయిల్ రద్దు చేయాలంటూ సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ లో సినీ నటి శ్రీసుధ పిటీషన్ వేసారు. సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసిన తరువాత తనను చంపడానికి కుట్ర చేసి , విజయవాడ లో కారు ఆక్సిడెంట్ చేశారంటూ కోర్టుకి శ్రీసుధ వివరించారు. ఈ కేసులో శ్యామ్ కె నాయుడు తో పాటు ఆయన సోదరుడు చోటకే నాయుడు కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు ఆమె ఆరోపించింది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి , శ్యామ్ కె నాయుడు కు సుప్రీం కోర్ట్ నోటీసులు ఇచ్చింది. నెలరోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి