ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లోనే కాకుండా మ‌న దేశంలో కూడా మ‌ళ్లీ క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా రోజుకు 18 వేల కేసుల‌కు పైగా న‌మోదు అవుతోన్న ప‌రిస్థితి. గ‌తేడాది లాక్‌డౌన్‌కు ముందు దేశంలో ఎలాంటి ప‌రిస్థితి ఉందో ఇప్పుడు కూడా మ‌ళ్లీ అదే ప‌రిస్థితి వ‌స్తుందా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా న‌మోదు అవుతోన్న క‌రోనా కేసులు చూస్తే ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో ప్రతి రోజు నమోదవుతున్నాయి. మ‌హారాష్ట్ర‌లోనే రోజుకు 10 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక్క‌డ థానే, పూణే, నాగ‌పూర్‌తో పాటు ముంబై లాంటి న‌గ‌రాల్లో క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో మ‌ళ్లీ మ‌హారాష్ట్ర లాక్‌డౌన్ దిశ‌గా ఆలోచ‌న చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: