ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల‌ను ప‌రిశుభ్ర ప‌రిచే విష‌యంలో మ‌న రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. మొత్తం ఎనిమిది అంశాల ప్రాతిప‌దిక‌న కేంద్ర ప్ర‌భుత్వం ఓడీఎఫ్‌ ప్లస్ పేరుతో స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమం చేపట్టింది. దేశంలో 1,060 గ్రామాలు ఈ లిస్టులో చేర‌గా... అందులో స‌గంకు పైగా ఏపీలోనే ఉన్నాయి.

ఇక హరియాణ రెండో స్థానం దక్కించుకుంది. అక్కడ 199 గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 89 గ్రామాలను గుర్తించగా.. తెలంగాణలో 22 గ్రామాలను గుర్తించారు. ఏదేమైనా జ‌గ‌న్ పాల‌న‌లో ఏపీకి మ‌రో అరుదైన గుర్తింపు ద‌క్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: