చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సొంత పార్టీలోనే వెన్నుపోటుదారులున్నార‌ని, వారిపై అధిష్టానం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని పుత్తూరు, న‌గ‌ర పుర‌పాల‌క సంఘాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి కొంద‌రు నేత‌లు ప‌నిచేశార‌ని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ గెలిచినా ప‌ర్వాలేదు అనే ఉద్దేశంతో 14 మంది వైసీపీ రెబెల్ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డ‌మే కాకుండా వారిని గెలిపించేందుకు భారీస్థాయిలో డ‌బ్బులు పంపిణీ చేశార‌ని చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మి కోసం ప‌నిచేసిన నేత‌లే ఇప్పుడు మ‌ళ్లీ రంగంలోకి దిగార‌ని, వెన్నుపోటుదారుల‌ను గుర్తించి పార్టీ అధిష్టానం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. వీరు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ న‌గ‌రి, పుత్తూరులో వైసీపీనే గెలుస్తుంద‌నే ధీమాను రోజా వ్య‌క్త‌ప‌రిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: