ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు. రైతు సమస్యల పట్ల జగన్ చిత్తశుద్ధిని ఆయన కొనియాడారు. గతంలో కూడా నారాయణ మూర్తి పలుసార్లు సీఎం జగన్ పాలనకు కితాబు ఇచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి ఆయన జగన్‌పై తనకు ఉన్న అభిమానం చాటుకున్నారు.
తూర్పు గోదావరి -
విశాఖ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఏలేరు, తాండవ కాల్వల అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేయడం సంతోషించదగ్గ విషయమని
నారాయణమూర్తి అన్నారు. గత ప్రభుత్వాలు
తూర్పుగోదావరి, ,విశాఖ జిల్లాలోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదని చెప్పారు.
జగన్ ముందు చూపుకు
నారాయణమూర్తి అభినందించారు.