నాగార్జున సాగర్ బీజేపీ కి రెబల్స్ షాకులు మామూలుగా లేవు. ఈ క్రమంలోనే ఆ పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్య టీఆర్ఎస్ వైపు చేరుతున్నారు. ఆయన కాసేపట్లో సీఎం కేసీఆర్ ను అంజయ్య కలవనున్నారు. అంజయ్య బీజేపీ టిక్కెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీ వాళ్లు రవికుమార్ కు టిక్కెట్ కేటాయించారు. దీంతో కడారి అంజయ్య బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. గతంలో స్వతంత్రంగా పోటీ చేసి అంజయ్య పాతిక వేల కు పైగానే ఓట్లు సంపాదించుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి