దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు
పార్టీ పిరాయింపులకు బ్రేక్ పడడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. తాజాగా
బీహార్ లో లోక్ జనశక్తి
పార్టీ (ఎల్జీపీ)కి చెందిన ఏకైక
ఎమ్మెల్యే రాజ్ కుమార్ సింగ్ జేడీయూ తీర్థం స్వీకరించారు.
బీహార్ అసెంబ్లీలో ఏకైక ఎల్జీపీ
ఎమ్మెల్యే అయిన
రాజ్ కుమార్ సింగ్ జేడీ(యూ)లో చేరారని
బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేడీ(యూ) అభ్యర్థిపై 333 ఓట్ల ఆధిక్యతతో ఎల్జీపీ అభ్యర్థి
రాజ్ కుమార్ సింగ్ విజయం సాధించారు. ఎల్జీపీ ఎమ్మెల్యే చేరికతో
బీహార్ లో జేడీయూ బలం పెరిగింది.