అమెరికాలో మ‌న తెలుగు వ్య‌క్తికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో డైల్‌హై మేయర్‌గా చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన ఎన్‌ఆర్‌ఐ సముద్రాల బాబురావు తనయుడు సుధీర్‌ ఎన్నికయ్యారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల నుంచి అమెరికాలో తెలుగు వాళ్లు ప‌లు కీల‌క ప‌ద‌వులు అధిరోహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాబురావు డెల్ హై మేయ‌ర్ అయ్యారు. ఆయ‌న భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం బుచ్చినాయుడుకండ్రిగలో ఆయన నివాసం వద్ద బంధువులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలోని ఓ నగరానికి సుధీర్‌ మేయర్‌ కావడం బుచ్చినాయుడుకండ్రిగ గ్రామానికి, తెలుగువారికి గర్వకారణమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: