వ‌రుస వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. జనగామ కోర్టు సీనియర్‌ న్యాయవాది కె.సునీత త‌న‌ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యానికి పిలిపించి బెదిరించార‌ని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ డీసీపీ శ్రీనివా్‌సరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఓ మ‌సీదు నిర్మించే విష‌యంలో ప‌క్క‌నే గ‌ణేశ్ దేవాల‌యం ఉంది. భ‌విష్య‌త్తులో మ‌త స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న ఉద్దేశంతో సునీత్ ఈ విష‌యాన్ని క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే మ‌సీదు నిర్మించే ధార్మిక సంస్థ స‌భ్యులు ఎమ్మెల్యేను క‌లిశారు. ఈ క్ర‌మంలోనే ముత్తిరెడ్డి సునీతతో పాటు కాలనీ వాసులను క్యాంపు కార్యాలయానికి పిలిపించడంతో పాటు త‌న‌ను ఇంట్లో కూర్చో.. బ‌య‌ట క‌నిపిస్తే బాగోద‌ని బెదిరించారని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే తాను ఈ విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని సూచించానే త‌ప్పా.. బెదిరించ‌లేద‌ని ముత్తిరెడ్డి చెపుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: