తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆరా ఎగ్జిట్‌ పోల్ ఫలితాలు వైఎస్సార్‌ సీపీ 65.85%, తెలుగుదేశం పార్టీ 23.10%, బీజేపీ 7.34% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. ఎగ్జిట్‌ పోల్ ఫలితాలకు తుది ఫలితాలకు 2 నుంచి 3 శాతం వరకు తేడా ఉండొచ్చని వెల్లడించింది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించనున్నారని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు..ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌ సీపీ 59.25%, టీడీపీ 31.25%, బీజేపీ 7.5% ఓట్లు సాధిస్తాయని స్పష్టం చేసింది. మే 2వ తేదీ ఆదివారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్న సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: