కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్లు కలిసి అసెంబ్లీలోకి త్వరలో అడుగుపెట్టనున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌(77) కన్నూర్‌ జిల్లా ధర్మదామ్‌ నుంచి, ఆయన అల్లుడు రియాస్‌(44) కోజికోడ్‌ జిల్లా బేపోర్‌ నియోజకవర్గం నుంచి, ఎమ్మెల్యేలుగా గెలిచారు. విజయన్‌ కూతురు వీణ, రియాస్‌ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. వీణ బెంగళూరులో ఐటీ సంస్థను నడుపుతుండగా రియాస్‌ డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. రియాస్‌ 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్‌ నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: