ఇక రెండు రోజులుగా నరేంద్ర తీవ్రమైన జ్వరం, అస్వస్థతతో బాధపడుతుండడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో విచారణ జరిగింది. ధూళిపాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు నరేంద్రకు సీటీ స్కాన్, ఇతర పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఆయనకు కరోనా నిర్థారణ అయితే వెంటనే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాలని స్పష్టం చేసింది.
ఇక నరేంద్ర అరెస్టు అయినప్పటి నుంచే టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సోషల్ మీడియాలో మద్దతు పలుకుతున్నారు. నరేంద్రను కాపాడుకుందాం నినాదాలో హోరెత్తిస్తున్నారు. ఎట్టకేలకు కోర్టు నిర్ణయంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి