తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నిర్మల్ పట్టణం నీట మునిగిందని ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపించి ముమ్మర చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సీఎం సూచించారు.

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ఇంట్లో నుండి బయటకు రావద్దని చెప్పారు. మరోవైపు రాబోయే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దాంతో రాబోయే మూడు రోజులు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రాబోయే మూడు రోజుల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr