ఓవైపు తన పీఠం ఎక్కడ కదిలిపోతుందోనని కర్ణాటక సీఎం యడ్యూరప్ప భయం భయంగా ఉండే.. ప్రధాన విపక్షం కాంగ్రెస్ యడ్డీని ఓ ఆట ఆడుకుంటోంది. కర్ణాటకలో సీఎంను మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంటే.. మారాల్సిన సీఎం కాదు.. ఏకంగా అధికార పార్టీ అంటోంది కాంగ్రెస్. మార్పులు పార్టీ వ్యక్తులు కాకుండా ప్రజలు చేయాలని అంటోంది.  దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ కర్ణాటక సీఎం యడ్యూరప్పకు  విసిరారు.


బీజేపీకి పాలన చేసే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదన్నారు శివకుమార్. ప్రజల అవసరాలను తీర్చడంలో యడ్యూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీకే శివకుమార్ విమర్శించారు. ప్రజలను ఎలా కాపాడాలో భారతీయ జనతా పార్టీకి తెలియదని... వారికి పాలించే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదని ఆయన మండిపడ్డారు. ఓ వైపు ప్రజలు చనిపోతుంటే వీళ్లకు మాత్రం కుర్చీ రాజకీయాలు కావాలా అని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: