తెలంగాణాలో ఈ మధ్య కాలంలో వినూత్న కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. దేశంలోనే మొదటిసారి మెడిసిన్ విషయంలో తెలంగాణాలో ప్రయోగం చేస్తున్నారు. వికారాబాద్ లో ఈ ప్రయోగం జరుగుతుంది. మెడిసిన్ ఫ్రమ్ దీ స్కై కార్యక్రమంలో భాగంగా డ్రోన్ లతో మెడిసిన్ సరఫరా ను నేడు లాంచనంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ప్రారంభిస్తారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, రాష్ట్ర ఐటీ, పూరపాలక శాఖ మంత్రి కేటీఆర్.

ఈ పథకంతో ఇక రవాణా సౌకర్యం లేని ప్రాంతాలకు  మందులు సరఫరా సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా ట్రాయల్ రన్ విజయవంతంగా పరిశీలించిన అధికారులు... నేడు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నిఖీల, ఎస్పీ నారాయణ కూడా పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts