రెండు తెలుగు రాష్ట్రాల్లో పిచ్చి కుక్కలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఓ కుక్క స్వైర విహారం చేయడం కలకలం రేపింది. గ్రామం లో 12 మంది పై ఆ కుక్క దాడి చేసింది. వీరిలో 10 మంది పిల్లలు కూడా ఉండటం గమనార్హం. వీరందరిని పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు స్థానికులు. 20 నెలల పసి పాపకు అరచేతిలో తీవ్ర గాయం అయింది అని వైద్యులు తెలిపారు.

చేతిలో శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి చేతులు, కాళ్ళు, తొడల పై గాయాలు అయ్యాయి అని అధికారులు తెలిపారు. పిల్లలు అందరూ 10 ఏళ్ల లోపు వయస్సు కల్గిన వారే అని తెలిపారు. ఒకరు 40 ఏళ్ల మహిళ, ఒకరు 65 ఏళ్ల వృద్ధుడు గాయపడిన వారిలో ఉన్నారు అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: