గుంటూరు జిల్లా జైలును పరిశీలించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కీలక వ్యాఖ్యలు చేసారు. మహిళా ఖైదీల పరిస్థితిని నేరుగా అడిగి తెలుసుకున్న వాసిరెడ్డి పద్మ... వారికి అండగా ఉంటామని అన్నారు. మహిళా ఖైదీలకు అందుతున్న పౌష్టికాహారం, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది అని ఆమె తెలిపారు.

మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారంపై రాష్ట్రవ్యాప్తంగా సెమినార్లు నిర్వహిస్తామని అన్నారు. మహిళల సాధికారత, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసారు. దిశ యాప్ ద్వారా మహిళలు సకాలంలో రక్షణ పొందుతున్నారు అని అన్నారు. కాగా మహిళా ఖైదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. మహిళా ఖైదీలకు సంబంధించి సత్ప్రవర్తన దిశగా ఏపీ ప్రభుత్వం మారిన దగ్గరి నుంచి చర్యలు చేపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: