సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చెరుకు రైతులకు సంఘీభావం తెలిపిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చెరకు పంటను కొనుగోలు చేయాలన్నా ఆయన ప్రగతి భవన్, యాదాద్రి, రాజన్న దేవాలయాలకు వందల కోట్లు కేటాయించిన కేసీఆర్ రైతులకు రివాల్వింగ్ ఫండ్ కేటాయిస్తే తప్పేంటి ? అని ప్రశ్నించారు. జహీరాబాద్ ప్రాంతం చెరుకూరు కర్ణాటక మిల్లులకు ప్రభుత్వమే తరలించే ఏర్పాటు చేయాలన్న రేవంత్ గిట్టుబాటు మద్దతు ధర ప్రకటిస్తే రైతు బంధు రైతు బీమా రుణమాఫీ రైతులకు అక్కర్లేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, చెరుకు ఫ్యాక్టరీలను నడిపించ లేని కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు అని రేవంత్ ప్రశ్నించారు, ఇక కేసీఆర్ కు పాలాభిషేకం కాకుండా క్వాటర్ ఫుల్ బాటిల్ తో అభిషేకం చేస్తే అప్పుడు రైతు సమస్యలపై స్పందిస్తారని రేవంత్ ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: