హైదరాబాద్ లో భారీ వర్షాల దెబ్బకు ఇప్పుడు ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని అధికారులు చెప్పినా సరే కొన్ని చోట్ల మాత్రం ప్రజలు మారడం లేదు. భారీ వర్షాలపై సిఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి సమీక్ష కూడా నిర్వహించారు. ఇక హైదరాబాద్ లో రోడ్ల పైకి భారీగా వరద రావడంతో అధికారులు అందరూ అలెర్ట్ అయ్యారు. రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ నిలిచింది.

అయితే కొన్ని చోట్ల భారీగా వరద ఉన్న నేపధ్యంలో వాహనదారులు అందరూ కూడా అప్రమత్తంగా వెళ్ళాలి అని హెచ్చరించారు. ప్రజలు కొన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వరదను పంపిస్తున్నారు. మాన్సూన్ బృందాలు ఎక్కడిక్కడ అలెర్ట్ అయ్యాయి. మరో నాలుగు గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది అని అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు భారీ వర్షం పడుతుంది అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts