గులాబ్ తుఫాన్ ప్రభావం హైదరాబాద్ మీద ఎక్కువగా పడుతుంది. నిన్న దాదాపు నాలుగు గంటల పాటు భారీగా వర్షం పడింది అని అధికారులు వెల్లడించారు. నిన్న భారీ వర్షం పడటంతో అధికారులు అందరూ అలెర్ట్ అయ్యారు. రాజేంద్ర నగర్ అప్ప చెరువు పొంగిపొర్లుతున్నది. బెంగళూర్ జాతీయ రహదారి గగన్ పహాడ్ వద్ద రోడ్డుపై వరద భారీగా ఉంది. అప్ప చెరువు నిండడంతో అలుగు పొంగి పొర్లుతుంది.

శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించిన అధికారులు... ఒక వైపే వాహనాలను అనుమతిస్తున్నారు. గతేడాది అప్ప చెరువు కట్ట తెగి నీటిలో కొట్టుకుపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వారు ఓఆర్ ఆర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం లేకపోయినా రెండు రోజులు జాగ్రతగా ఉండాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts