తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చ‌రిత్ర‌లో ఒక అరుదైన  రికార్డు న‌మోదు కానుంది.  ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించే మ‌హాఅద్భుత‌మైన భాగ్యం క‌లుగ‌నుంది.   1953లో టీటీడీ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోకి వ‌చ్చింది. అప్ప‌టినుంచే బ్ర‌హ్మోత్స‌వాల‌కు ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించే సాంప్ర‌దాయం ప్రారంభ‌మైంది. తొలుత ఎండోమెంట్ అధికారులు, ఆ త‌రువాత దేవాదాయ‌శాఖ‌కు సంబంధించిన మంత్రులు ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించేవారు. కానీ టీడీపీ ముఖ్య‌మంత్రి నందమూరి తార‌క‌రామారావు కాలం నుంచి సీఎంలే ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించుకుంటూ వ‌స్తున్నారు.

తాజాగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మూడోసారి స‌మ‌ర్పించ‌నున్నారు. ఆయ‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఐదుసార్లు స‌మ‌ర్పించారు. తండ్రి త‌న‌యులు ఇద్ద‌రూ ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించే స‌మ‌యాల్లో అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి టీటీడీలో విధులు నిర్వహించ‌డం మ‌రోవిశేషం.  సీఎం వైఎస్ జ‌గ‌న్ శ్రీ‌వారికి సోమ‌వారం ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించ‌నున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఈ రికార్డు న‌మోదు చేయ‌లేదు. ఒకే కుటుంబంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మ‌ర్పించిన ఘ‌న‌త వైఎస్ ఫ్యామిలీకే చెందింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: