
మా ఎన్నికల ఫలితాలు వెలువడి విష్ణు గెలిచిన తర్వాత ఒక అనూహ్య సంఘటన ఈరోజు ఉదయం జరిగింది. గతంలో మాకు అధ్యక్షుడిగా పనిచేసిన నాగబాబు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. సంకుచిత రాజకీయాలు.. ప్రాంతీయ విద్వేషాలు కొనసాగుతున్న తరుణంలో తాను ఇమడబోనని ప్రకటిస్తూ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు చిరంజీవి వర్గం మద్దతిచ్చినా ప్రకాష్ రాజ్ గెలవలేదు కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లోకూడా పట్టు నిలుపుకోవడం కష్టమనేది నాగబాబు భావన అయివుండొచ్చంటున్నారు. విష్ణు గెలవడం కూడా భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఈ సారి ఎన్నికలకు వారు ఇంకా బలోపేతమవుతారు. మళ్లీ తిరిగిపోటీచేయవచ్చు.. లేదంటే ఈసారి ఎన్నిక ఏకగ్రీవం అవ్వొచ్చు. అంటే ఒకరకంగా మా అధ్యక్ష ఎన్నికలపై గత రెండు ఎన్నికల్లో పట్టుసాధించిన చిరంజీవి కుటుంబం పట్టు సడిలిపోతుండటంతో తర్వాత ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకోవడం అనవసమని నాగబాబు భావించి ఉంటారంటున్నారు. మరి వాస్తవమేంటో నాగబాబుకే తెలియాలి.