ఇలాంటి సినిమాకి సీక్వెల్ రావాలి అనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు అది కేవలం కోరికగానే మిగిలిపోయింది. కానీ తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. మురారి సినిమాకు సీక్వెల్ ప్లాన్ జరుగుతోందని, అది కూడా ఈసారి కొత్త హీరోతో ఉంటుందని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ సీక్వెల్‌లో మహేష్ బాబు కాకుండా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిని ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తనదైన కామెడీ టైమింగ్‌తో, సహజమైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నవీన్ పోలిశెట్టి, రీసెంట్‌గా అనగనగా ఒక రాజు సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.
ఇప్పుడు అదే నవీన్ పోలిశెట్టి మురారి సీక్వెల్‌లో నటిస్తే ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఊహించుకుంటూనే సంబరపడిపోతున్నారు. మురారి కథలోని ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌కు, నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ జతకలిస్తే థియేటర్లలో నవ్వులే నవ్వులు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాదు… ఈ సినిమాలో హీరోయిన్‌గా కూడా ఆసక్తికరమైన కాంబినేషన్‌ని పరిశీలిస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, నవీన్ పోలిశెట్టి – శ్రీలీల కాంబినేషన్ను మేకర్స్ ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో నిజమైతే యంగ్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఫిలిం నగర్‌లో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇప్పటికే మురారి సీక్వెల్ గురించి పోస్టులు, మీమ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. నవీన్ పోలిశెట్టి ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెబితే, అది ఆయన కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మరి నిజంగా మురారి సీక్వెల్ రాబోతుందా? నవీన్ పోలిశెట్టి హీరోగా కనిపించబోతున్నాడా? శ్రీలీల హీరోయిన్‌గా ఖరారవుతుందా? ఇవన్నీ తెలియాలంటే మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. అప్పటివరకు మాత్రం ఈ వార్త అభిమానుల ఊహలకు రెక్కలు ఇచ్చిందని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి