తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని అల‌క బూనారు. ఆయన్ను పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ఇత‌ర‌ నేతలు బుజ్జగించారు. అయితే ఇంతటితో సమస్య ఆగిపోతుందని భావించినప్పటికీ స‌రికొత్త స‌మ‌స్య త‌లెత్తింది. సోమ‌వారం మరోసారి కేశినేని వ్యవహారం తెలుగుదేశం వ‌ర్గాల‌తోపాటు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. కేశినేని భవన్‌లోని పార్లమెంట్ కార్యాల‌యంలో  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫొటో తొలగించేశారు. బాబుతోపాటు మరికొందరి ముఖ్యనేతల ఫొటోలను కూడా కేశినేని నాని తొలగింప‌చేయ‌డం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఫొటో స్థానంలో రతన్‌టాటా, నాని కలిసి ఉన్న ఫొటోలు రావ‌డం, ఏడు నియోజకవర్గాల ఇంచార్జులు, నేతల స్థానంలో గత ఐదేళ్లలో చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను నాని త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆయ‌న పార్టీ మార‌నున్నార‌ని, అందుకే ఫొటోలు కూడా తొల‌గించార‌ని వార్త‌లు వ‌స్తున్నారు. పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ‌తార‌నేదానిపై కేశినేని అనుచ‌రులు ఇంకా స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa