ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించే పార్టీలపై జరిగే దాడులను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రేపు రాష్ట్ర బంద్‌కు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీలన్నీ సహకరించాలని ఆయన కోరారు. తాను ఎప్పుడూ బంద్‌కు పిలుపు ఇచ్చేవాడిని కాదనీ, కానీ ఇప్పుడు బంద్‌కు పిలుపు ఇచ్చామంటే పరిస్థితిని పార్టీలన్నీ అర్థం చేసుకోవాలనీ, ఇది తన కోసం కాదనీ, మనందరి కోసం అని చంద్రబాబు వివరించారు. 356 ఆర్టికల్‌ను అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కోరుకోలేదనీ, కానీ ఇప్పుడు ఆ డిమాండ్‌ను పార్టీ చేస్తుందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో ప్రజాస్వామ్యవాదులు అందరూ అర్థం చేసుకోవాలని చంద్రబాబు విన్నవించారు. ప్రస్తుతం పార్టీ ఆఫీసులపై జరిగిన దాడి ఘటన శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమనీ, ఇంతకంటే ఫెయిల్యూర్‌ ఏముంటుందో వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: