ద‌ళిత వ్య‌తిరేకి ఎవ‌రు అనేది ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తారు. నేనా.. లేక కేసీఆర్ అనేది ఎన్నిక‌ల ఫ‌లితాలే చెబుతాయి అని మాజీ మంత్రి ఈట‌ల పేర్కొన్నారు. బుధ‌వారం హూజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని వీణ‌వంక మండ‌లం రెడ్డిప‌ల్లిలో ఈట‌ల రాజేంద‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈట‌ల‌ మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్  2014 ఎన్నిక‌ల‌కు ముందు ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని ఇచ్చిన హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో 17 శాతం జ‌నాభా ఉన్న ద‌ళితుల‌కు ఒక్క ప‌ద‌వీ క‌ట్ట‌బెట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

ద‌ళితుల‌కు ఇస్తాన‌న్న మూడు ఎక‌రాల భూమి ఏమైంద‌ని, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నారు. మొన్న‌టిదాక నాపై నేనే దాడి చేయించుకుంటాన‌ని ప్ర‌చారం చేశారు. మ‌రి ఇప్పుడు దీర్ఘ‌కాలిక రోగాల‌తో బాధ‌ప‌డుతున్న వారిని నేనే ఆత్మ‌హ‌త్యల‌కు ఉసిగొలిపాన‌ని.. చావుమీద సానుభూతి పొందుతాన‌ని ఎమ్మెల్యే పేర్కొంటున్నాడు. ఇదేనా మీ నీతి అని అడిగారు. అక్టోబ‌ర్ 30 త‌రువాత నాకు ఏమి ప‌ని ఉండదు.  నీ భ‌ర‌తం ప‌ట్ట‌డ‌మే నా ప‌ని. రాష్ట్రం మొత్తం తిరుగుతా. నీ భ‌ర‌తం ప‌డుతా.. ఇప్ప‌టికైనా చెప్పు కేసీఆర్ ద‌ళితుల‌కు వ్య‌తిరేకి నువ్వా నేనా అని ప్ర‌శ్న‌లు కురిపించారు ఈట‌ల‌.


మరింత సమాచారం తెలుసుకోండి: