బద్వేలు మ్యాచ్ ఫైనల్స్ కు చేరింది. నోట్ల పంపిణీ షురూ కాకపోవడంతోనే ఈ సారి అక్కడ మెజార్టీ ఆశించిన విధంగా వైసీపీకి రాలేదన్న మాట ఒకటి వినిపిస్తోంది. ముఖ్యంగా జగన్ నిర్దేశించుకున్న లక్షా 30 వేల ఓట మెజార్టీ అన్నది రాకుండా పోయింది.
వైసీపీ తరఫున పోటీచేసి గెలిచిన సుధకు 90 వేలకు పైగా మెజార్టీ వచ్చింది. 90411 ఓట్ల తేడాతో ఆమెను గెలిపించి, బద్వేలు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అయితే ఆశించిన స్థాయి విజయం ఇది కానేకాదని కొందరు పెదవి విరుస్తున్నారు. పెద్ది
రెడ్డి రామచంద్రారెడ్డి, రోజారెడ్డి లాంటి నేతలు కలిసి ఈ మ్యాచ్ ను ముందుకు నడిపించినా కూడా ఫీల్డ్ లో అనుకున్న ఫలితం రాలేకపోయిందన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది. వైఎస్
అవినాశ్ రెడ్డి (ఎంపీ) కూడా ప్రజలకు బాగానే హామీలు ఇచ్చినప్పటికీ అవేవీ మరీ అంతగా ప్రభావితం చేయలేదు.
బీజేపీ అభ్యర్థి
సురేశ్ అంతగా ఓటర్లను ప్రభావితం చేయకపోవడం,
టీడీపీ బరిలో తప్పుకోవడం, పవన్ తో సహా మిగతా వర్గాలు కూడా ఇలానే వ్యవహరించడంతో
వార్ ఓ విధంగా ఒన్ సైడ్ అయినా కూడా ఇది మంచి ఫలితం కానే కాదని కూడా ఇంకొందరు అంటున్నారు. అయితే డబ్బు పంచితే మెజార్టీ పెరిగే ఉండేదని కానీ ఈ సారి ఈ ఎన్నికల్లో ఆ సూత్రాన్ని పాటించకుండా తాను చేసిన సంక్షేమం మరియు తాను తీసుకువచ్చిన అభివృద్ధి ఈ రెంటినే నమ్ముకుని క్షేత్ర స్థాయిలో తిరగాలని తన
పార్టీ నాయకులకు సూచించారు సీఎం. దీనినే ముఖ్య నేతలంతా పాటించి అభ్యర్థి గెలుపునకు ప్రచారం నిర్వహించి సక్సెస్ అయ్యారు. కానీ ఆశించిన రీతిలో ఇది ఫలితం కాదు కానీ ఓ విధంగా చూసుకుంటే గతంలో కన్నా ఈ సారి మెజార్టీ రెండింతలు అయిందన్నది వాస్తవం. గతంలో 44 వేల ఓట్ల మెజార్టీ వస్తే ఈ సారి అది రెట్టింపు కావడం ఓ శుభ పరిణామమే!