హుజూరాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ గెలుపు దాదాపు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఫ‌లితాల‌లో ఈట‌ల దాదాపు ముందంజ‌లోనే ఉన్నారు. కేవ‌లం రెండు రౌండ్‌ల‌లో త‌ప్ప‌.. మిగ‌తా అన్ని రౌండ్ల‌లోనూ ఆధిక్య‌త క‌న‌బ‌రిచారు. రౌండ్ రౌండ్‌కు బీజేపీ  మెల్ల మెల్ల‌గా ఆధిక్య‌త‌ను పెంచుకున్న‌ది.  16వ రౌండ్‌లో కూడ మెజార్టీ సాధించింది. 1,772 ఓట్ల ఆధిక్య‌త సాధించింది. మొత్తం 13255 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది ఈట‌ల‌కు. బీజేపీ అభ్య‌ర్థి 74,175 టీఆర్ఎస్ అభ్య‌ర్థి 60,920, కాంగ్రెస్ 2,131 ఓట్లు ద‌క్కించుకున్నాయి.

మొద‌టి నుంచి బీజేపీ త‌న‌దైన శైలిలో దూసుకెళ్లింది. కేవ‌లం ఎనిమిది, ప‌ద‌కొండు రౌండ్‌ల‌లో కాస్త వెనుకంజ ప‌డింది. మ‌ళ్లీ పుంజుకొని ఊహించ‌ని విధంగా మెజార్టీలో ముందంజ‌లో నిలిచింది బీజేపీ. ఇక రెండు మండ‌లాలో మాత్ర‌మే కౌంటింగ్ జ‌ర‌గాల్సి ఉన్న‌ది.వీటిపై బీజేపీ భారీ ఆశ‌లున్నాయి.  బీజేపీ నేత‌లు అక్క‌డ‌క్క‌డ సంబురాలు జ‌రుపుకుంటున్నారు. ఈట‌ల గెలుపు ఖాయం అని పేర్కొన్నారు. గ‌త దుబ్బాక ఫ‌లితాలు న‌వంబ‌ర్‌లోనే వ‌చ్చాయి. హుజూరాబాద్ కూడ న‌వంబ‌ర్‌లోనే ఫ‌లితాలు రావ‌డంతో బీజేపీకి న‌వంబ‌ర్ నెల క‌లిసి వ‌స్తోంద‌నే చ‌ర్చ మొద‌లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: