వివరాలలోకి వెళ్లితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్‌లో ప్రతీ సంవత్సరం ఆడంబరంగా గోవర్ధన్ పూజ నిర్వహిస్తుంటారు. ఈ పూజలో గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ తరువాత పూజ అనంతరం భక్తులు కొరడాతో కొట్టించుకుంటారు. గోవర్ధన్ పూజ ముగిసిన తరువాత కొరడా దెబ్బలు తింటే సమస్యలు తొలగిపోతాయని అక్కడి ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఇవాళ దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవర్ధన్ పూజకు హాజరైన బఘేల్ కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు.
అయితే సీఎం భూపేశ్ బఘేల్‌ను జంజిగిరి గ్రామానికి చెందిన బీరేంద్ర ఠాకూర్ కొరడాతో కొట్టారు. ఆ తరువాత సీఎం బఘేల్ మాట్లాడారు. గోవును పూజించే ఈ గోవర్ధన్ పూజా కార్యాక్రమం చాలా గొప్ప సంప్రదాయం అని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా భావితరాలకు అందజేయడం మనందరి బాధ్యత అని సీఎం తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి