ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ  విభ‌జ‌న‌తో ఏపీ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇవాళ స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి విద్యుత్ బ‌కాయిలు ఇప్పించండి. రాష్ట్రాల మ‌ధ్య హామీలు జ‌రుగ‌లేద‌ని, రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌లు నిర్దేశిత స‌మ‌యంలో ప‌రిష్కారం కావాల‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ది. రాష్ట్రం విడిపోయి ఇప్పటికీ ఏడేండ్లు గ‌డిచినా హామీలు మాత్రం అమ‌లు కాలేద‌ని స్ప‌ష్టం చేసారు.

రెండు రాష్ట్రాల మ‌ధ్య ఆస్తుల పంపిణీ జ‌ర‌గ‌లేదని, పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణ వ్య‌య‌నిర్థార‌ణ‌లో 2013-14 ధ‌ర‌ల సూచితో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు సీఎం జ‌గ‌న్‌. అదేవిధంగా ప్ర‌త్యేక హోదా హామీని కూడ నెర‌వేర్చ‌లేద‌ని అన్నారు.  దీని కోసం ఓ ప్ర‌త్యేక క‌మిటీని కూడ ఏర్పాటు చేయాల‌ని వివ‌రించారు. తీవ్ర న‌ష్టాల్లో ఉన్న ఏపీ డిస్కం కంపెనీల‌కు ఊర‌ట క‌ల్పించాల‌ని కోరారు.  కీల‌కంగా ముఖ్యంగా ఏడు అంశాల‌ను సీఎం జ‌గ‌న్ అమిత్ షా ముందు ఉంచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: