గ‌త కొద్ది రోజుల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల‌లో భారీ వ‌ర్షం కురుస్తూ ప‌లు న‌దుల బ్రిడ్జీలు కూలిపోతున్న విష‌యం విధిత‌మే. కొంత మంది గ‌ల్లంతు, మృత్యువాత‌, వాగుల్లో వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని ప్ర‌జ‌ల‌తో పాటు ప‌శువులు, గేదెలు, మేక‌లు, కోళ్లు కొట్టుకుపోతుండ‌డం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా క‌డ‌ప జిల్లా కమాలాపురంలో పాపాగ్ని న‌దిపై ఉన్న బ్రిడ్జీ శ‌నివారం అర్థ‌రాత్రి ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది.

వెలిగ‌ల్లు జ‌లాశయం నాలుగు గేట్ల‌ను ఎత్తివేయ‌డంతో వ‌ర‌ద నీరు పోటెత్తిన‌ది. రెండు రోజులుగా వంతెన వ‌ద్ద నీరు ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వ‌హిస్తున్న‌ది. నీరు అంచుల వ‌ర‌కు చేర‌డంతో నానిపోయి ఉన్న బ్రిడ్జి అర్థార‌త్రి దాటిన త‌రువాత ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయిన‌ది. ఈ వంతెన అనంత‌పురం నుంచి క‌డ‌ప‌కు వెళ్లే జాతీయ ర‌హ‌దారిపై ఉండ‌డంతో వాహ‌న‌దారుల రాక‌పోక‌ల‌న్నీ నిలిచిపోయాయి. మార్గంలో వెళ్లాల్సిన వాహ‌నాల‌ను దారి మ‌ళ్లిస్తున్నారు అధికారులు. వంతెన పున‌రుద్ధ‌రించేందుకు దాదాపు నెల రోజుల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొంట‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: