ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న‌మైన నిర్ణ‌యం తీసుకుంది. అన్ని ప్రాంతాల‌కు స‌మాన‌మైన అభివృద్ధి జ‌ర‌గాల‌ని, రాజ‌ధాని ఒకే ప్రాంతానికి ఉండ‌కూడ‌ద‌ని..  విశాఖ ప‌ట్ట‌ణం ఎగ్జిక్యూటివ్‌, క‌ర్నూలు న్యాయ రాజ‌ధాని, అమ‌రావ‌తి శాస‌న రాజ‌ధానిగా ప్ర‌వేశ‌పెట్టిన నిర్ణ‌యాన్ని తాజాగా  ఉప సంహ‌రించుకున్న‌ది. ఉప‌సంహ‌క‌రించుకున్న‌ట్టు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకొచ్చారు.  

ఓ వైపు అమ‌రావ‌తి నేత‌లు పాద‌యాత్ర చేప‌ట్ట‌డం.. మ‌రోవైపు బీజేపీ నేత‌ల ప‌ర్య‌ట‌న‌.. అదేవిధంగా అమిత్ షా తో సీఎం భేటీ కావ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకున్నట్టు ఇవాళ‌ క్యాబినెట్‌లో నిర్ణ‌యం తీసుకుంది. అమ‌రావ‌తి రైతుల ఆందోళ‌న చేస్తుండ‌డంతో బీజేపీ నేత‌లు ఎందుకు పాల్గొన‌డం లేద‌ని అమిత్ షా దిశానిర్దేశం చేసిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా హై కోర్టులో రైతుల విచార‌ణ‌లో మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌పై అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ హై కోర్టు కు తెలియ‌జేసారు. హై కోర్టు మ‌ధ్యాహ్నానికి వాయిదా వేసింది.

మూడు రాజ‌ధానుల చ‌ట్టంపై సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ది. ఇప్ప‌టికే ఏపీ హైకోర్టుకు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర మంత్రుల‌కు కూడా తెలియ‌కుండా గోప్యంగా ఉంచారు. అయితే దీని వెనుక క‌చ్చితంగా అమిత్‌షాతో ముఖ్య‌మంత్రి భేటీ అయిన త‌రువాత ఏపీ ప్ర‌భుత్వం  ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో  ప‌లు చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. రాజ‌ధానుల వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి మాట్లాడుతార‌ని ఏపీ ఏజీ వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: