దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ప‌రిస్థితి రోజు రోజుకు మ‌రింత క్షీణిస్తున్న‌ద‌నే చెప్పొచ్చు. వ‌ర‌స‌గా  ఏ ఎన్నిక‌లు జ‌రిగినా ఆ పార్టీని ఓట‌మిలు కుంగ‌దీస్తున్నాయి. కీల‌క‌మైన పార్టీ క్యాడ‌ర్‌, నాయ‌కులు ప‌క్క పార్టీల వైపు జంప్ అవ్వ‌డం వంటివి త‌రుచూ జ‌రుగుతూనే ఉన్నాయి. దీని వ‌ల్ల కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికి దిగ‌జారి పోతున్న‌ది. ఇదిలా ఉంటే మ‌రోవైపు పార్టీలో కుమ్మ‌లాటలు కూడా.. దేశ‌వ్యాప్తంగా సీనియ‌ర్‌, జూనియ‌ర్లు అంటూ ఏదో ఒక సంద‌ర్భంగా వ‌ర్గాల్లాగా చీలిపోయి విభేదాలు త‌లెత్తుతున్నాయి.

తాజాగా మెఘాల‌యాలో మ‌రొక రాజ‌కీయ ప‌రిణామం చోటు చేసుకొంది. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తృణ‌మూల్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. వీరంద‌రూ మెఘాల‌యా మాజీ సీఎం ముకుల్ సంగ్మా సార‌థ్యంలో టీఎంసీలో చేరి షాక్ ఇచ్చారు. రాత్రికి రాత్రి టీఎంసీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా అవ‌త‌రించింది మెఘాల‌యాలో. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ముకుల్ సంగ్మాకాంగ్రెస్ పార్టీపై అస‌హ‌నంతోనే ఉన్నారు. గ‌త సెప్టెంబ‌ర్ లో మెఘాల‌యా రాష్ట్ర అధ్య‌క్షునిగా షిల్లాంగ్ లోక్‌స‌భ స‌భ్యుడు విన్సెంట్ హెచ్‌.పాల ను నియ‌మించడంతో మాజీ ముఖ్య‌మంత్రి సంగ్మా కాంగ్రెస్ అధిష్టానం పై కోపంగా ఉన్న‌ట్టు స‌మాచారం. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామంతో బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీకి ఊపును ఇస్తుంది. సొంత రాష్ట్రం కాకుండా మ‌రొక రాష్ట్రంలోపాగా వేసేందుకు మెఘాల‌య రాజ‌కీయం కీల‌కంగా మార‌నున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: