నూతన వేరియంట్ లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు సైతం వెల్లడించారు. డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకరమైనది కావడంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే అప్రమత్తం అవుతున్నాయి. వివిధ దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కూడా విధించాయి.
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ నూతన వేరియంట్ సోకుతుందని వస్తున్న వార్తలపై ఇవాళ మోడీ చర్చించబోనున్నారు. కొత్త వేరియంట్‌తో పాటు దేశంలో కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది.. వ్యాక్సినేషన్ ఏవిధంగా నడుస్తోందనే విషయాలను కూడా చర్చించనున్నారు ప్రధాని.