ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాజాగా ఆరోగ్య శ్రీ‌పై  మ‌రొక కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీలో క్యాన్స‌ర్ బాధితుల‌కు ఆరోగ్య‌శ్రీ ద్వారా చికిత్స అందించాల‌ని నిర్ణ‌యించారు జ‌గ‌న్‌. క్యాన్స‌ర్ బాధితులు మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల‌లో మూడు క్యాన్స‌ర్ మ‌ల్టీస్పెషాలిటీ ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు ఏపీ ముఖ్య‌మంత్రి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క్యాన్స‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రులు లేక‌పోవ‌డంతో హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల‌కెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందని సీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు.

నూత‌నంగా నిర్మిస్తున్న‌16 మెడిక‌ల్ క‌ళాశాల‌లో సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌లు అందుతాయి అని.. ఇవి కాకుండా క్యాన్స‌ర్ చికిత్స కోసం ప్ర‌త్యేకంగా మూడు సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు సీఎం. ఆరోగ్య శ్రీ సేవ‌ల కోసం ప్ర‌త్యేకంగా ఒక యాప్‌ను కూడా తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం ఆమోదం తెలిపారు. ఈ యాప్‌లో ముఖ్యంగా సందేహాల నివృతికి ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు సూచ‌న‌లు చేసారు. ఆరోగ్య మిత్ర‌కు ఈ యాప్‌ను ఆరోగ్య శ్రీ ట్ర‌స్ ఇవ్వ‌నున్న‌ది. ఇప్ప‌టికే వారికి సెల్‌ఫోన్లు స‌మ‌కూర్చేందుకు కూడా సీఎం గ్రీన్ సిగ్న‌లిచ్చారు. ముఖ్యంగా  వివిధ‌ ఆసుప‌త్రుల‌లో ఆరోగ్య మిత్ర వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసి.. రోగుల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందించాల‌ని సీఎం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: