వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ హెన్రీ క్రిస్టీనా అర్హతలపై తెనాలి కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై స్పందించిన కోర్టు.. వచ్చే నెల 25 న విచారణకు రావాలని క్రిస్టినా, జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషన్ కు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో పోటీకి హెన్రీ క్రిస్టీనా అనర్హురాలని తెనాలి కోర్టులో పిటిషన్ దాఖలైంది.


ఎందుకంటే.. క్రిస్టీనాకు నలుగురు సంతానం ఉన్నారని సరళ కుమారి పిటిషన్ దాఖలు చేసింది. క్రిస్టినా కుల ధృవీకరణపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సమయంలోనే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని సరళ కుమారి అంటోంది. తాజాగా తెనాలి కోర్టు లో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని క్రిస్టీనా ఎన్నిక చెల్లుబాటు కాదని పిటిషన్ లో సరళ కుమారి పేర్కొన్నారు. దీంతో జెడ్పీ ఛైర్ పర్సన్ క్రిస్టీనా కు తెనాలి కోర్టు నోటీసులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

YCP