ఏపీ సీఎం జగన్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు.. ఇవాళ విశాఖపట్నం చేరుకోనున్న సీఎం జగన్.. అక్కడి నుంచే ఉత్తరాంధ్ర పర్యటనను నిర్వహించబోతున్నారు. రేపటి నుంచి మూడు రోజులు పాటు సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉంటుంది. ఎల్లుండి విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తారు. ఈనెల 17న విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.


ప్రధానంగా ఈ జిల్లాల్లో జరిగే స్పందన వర్క్ షాపుల్లో సీఎం జగన్ పాల్గొంటారని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం సీఎం జగన్ ఇవాళ విశాఖ పట్నం చేరుకుంటారు. విశాఖ పట్నంలోనే బస చేస్తూ మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి వస్తుంటారు. ఈనెల 17 న విశాఖ జిల్లా పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: