శ్రీలంక జట్టు త్వరలో ఇండియా టూర్‌ కు రాబోతోంది. అయితే.. ముందుగానే ఖరారైన ఈ టూర్‌కు సంబంధించి  బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. భారత్‌లో శ్రీలంక క్రికెట్‌ జట్టు పర్యటన షెడ్యూల్‌లో బీసీసీఐ మార్పులు చేస్తున్నట్టు తెలిపింది. శ్రీలంక జట్టు పర్యటనలో కొన్ని తేదీలు, మరికొన్ని వేదికలు మారినట్టు బీసీసీఐ వెల్లడించింది.

భారత్‌లో 3 టీ ట్వంటీలు, 2 టెస్టులు ఆడేందుకు శ్రీలంక జట్టు ఇండియా రాబోతోంది. అయితే.. లక్నో వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగబోతోంది. ఆ తరవాత జరిగే రెండు టీ 20లు ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య జరగబోతున్నాయి. అలాగే  ఈ టీ20 మ్యాచ్‌ల తర్వాత మరో రెండు టెస్టులు ఉంటాయి. మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి 8 వరకు తొలి టెస్టు జరగబోతోంది. అలాగే రెండో టెస్టు బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు జరగబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: