కేంద్ర మంత్రి గడ్కరీ రేపు ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నారు. ఏపీలో చేపడుతున్న పలు జాతీయ ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.

దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులు ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే సిద్ధమైన పలు రహదారులను ప్రారంభిస్తారు. బెంజ్‌ సర్కిల్‌లోని రెండో ఫ్లై ఓవర్‌ను ఆయన ప్రారంభిస్తారు. అయితే.. ఈ పర్యటన వివాదాస్పదం అవుతోంది. గడ్కరీ రాక కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మోదీ ఫొటో లేదని బీజేపీ నేతలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మోదీ ఫొటో లేకుండా చేసిందని మండిపడుతున్నారు. పూర్తిగా కేంద్ర నిధులతో పైవంతెన పనులు జరిగాయని.. మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: