చంద్రబాబు రూ.6 వేల కోట్లు.. జగన్ రూ.22 వేల కోట్లు.. ఇవీ టీడీపీ బయటపెడుతున్న లెక్కలు.. ఈ లెక్కలు ఏంటనుకుంటున్నారా.. ఇవి మద్యం ఆదాయం ద్వారా ఏపీ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం లెక్కలు.. రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతోందంటున్న టీడీపీ నేతలు.. మద్యనిషేధం హామీపై ప్రజల్ని మోసగించిన జగన్ రెడ్డి మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారని విమర్శిస్తున్నారు.

ఇందుకు ఇవిగో ఆధారం అంటూ కొన్నిలెక్కలు బయటపెట్టారు. అవేంటంటే.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి ఏటా మద్యం ద్వారా కేవలం రూ.6వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చేదట. కానీ.. ఇప్పుడు జగన్ హయాంలో ఒక్క మద్యం ద్వారానే  రూ.22వేల కోట్ల పైబడి ఆదాయం వస్తోందట. అంటే జగన్ మద్య పాన నిషేధం దశల వారీగా అమలు చేస్తానని హామీ చేసి మరీ అధికంగా ఆదాయం మద్యం ద్వారా సంపాదిస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: