శ్రీలంక పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. చివరకు పెట్రోల్, డీజిల్‌ కూడా విదేశాల నుంచి కొనే పరిస్థితి లేదు. మరి ఈ దుస్థితికి కారణం ఏంటి.. శ్రీలంక కష్టాలకు 15 ఏళ్ల క్రితమే బీజం పడింది. అప్పటి అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స తీసుకున్న నిర్ణయాలే ఈ దుస్థితికి కారణంగా చెబుతున్నారు.


దేశం అప్పులకుప్పగా మారడం అప్పటి నుంచే ఆరంభ మైంది. అప్పట్లో ప్రభుత్వ బాండ్లను మార్కెట్ లో విచ్చలవిడిగా విక్రయించారు. చైనాకు అంతులేని ప్రాధాన్యం ఇచ్చారు. తమ సొంత ఓడరేవు హంబన్ టోటాను అభివృద్ధి చేసేందుకుచైనా నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది.


అలాగే ఎల్‌టీటీఈతో శ్రీలంక ప్రభుత్వం చేసిన సుదీర్ఘ పోరాటం ఆ దేశానికి పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. అలాగే విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడంలోనూ శ్రీలంక ప్రభుత్వం తప్పటడుగులు వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: