రెండు మూడు నెలలుగా సాగుతున్నా ఇంకా ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఓ దరికి చేరలేదు.. అంత పెద్ద దేశం రష్యా కూడా ఉక్రెయిన్ మెడలు వంచలేకపోతోంది. ఉక్రెయిన్ ను అమెరికాతో పాటు నాటో దేశాలు అండదండలందించడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే.. ఇన్నాళ్లూ పరోక్షంగా సాయపడిన అమెరికా ఇక ఇప్పుడు నేరుగా తన బ్రహ్మాస్త్రాలను ఉక్రెయిన్‌కు అందిస్తోంది. ఉక్రెయిన్‌ చేతికి అత్యాధునిక రాకెట్‌ లాంఛర్లను ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది.


ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. స్వతంత్ర, ప్రజాస్వామిక, సార్వభౌమిక, సంపన్న ఉక్రెయిన్‌ను చూడాలంటే ఇలాంటి సాయం చేయాల్సిందే అంటోంది అమెరికా. దురాక్రమణదారుల నుంచి ఆత్మరక్షణ చేసుకొనేలా ఉక్రెయిన్‌కు సాయం చేస్తామని చెబుతోంది. అయితే.. నాటో-రష్యా మధ్య యుద్ధాన్ని మాత్రం కోరుకోవడం లేదని బైడెన్‌ అంటున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి.. వారం రోజుల్లో అమెరికా నుంచి అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థలు ఉక్రెయిన్‌కు రాబోతున్నాయన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: