రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల ఖాతాల్లో డబ్బు వేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9వ విడత రైతుబంధు నిధులు రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి 10వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తున్న సంగతి తెలిసింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 50వేల 447.33 కోట్లు రైతుల ఖాతాలో జమచేసినట్లు మంత్రి వివరించారు.


అలాగే రైతు భీమా పథకం ద్వారా ఇప్పటి వరకు 83వేల 118 మంది రైతు కుటుంబాలకు సాయం చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 4వేల150 కోట్లు పరిహారం అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి తెలంగాణలో  మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రాత్సహించడంలో భాగంగా 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: