ఇవాళ హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు నిర్మాతల మండలి సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి తెలుగు సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, కార్మిక సంఘాల నేతలు హాజరుకాబోతున్నారు. ఈ సమావేశంలో ఓటీటీ ప్రభావం, వీపీఎఫ్ ఛార్జీలు, సినిమా బడ్జెట్ పరిమితులు అనే అంశాలతో పాటు మరికొన్ని అంశాలపైనా చర్చించనున్నారు. సినిమా హీరోలు, ఇతరుల పారితోషకాలు, టికెట్ ధరలు, కార్మికుల వేతనాల సవరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

అయితే.. కొన్ని రోజులుగా సినీ నిర్మాతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కరోనా తర్వాత ప్రేక్షకుడు థియేటర్‌ వైపు అడుగు పెట్టడం బాగా తక్కువైంది.అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందుకే టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ఎలా.. ప్రేక్షకుడి ఆకట్టుకోవడం ఎలా.. అనే కోణంలో చర్చ సాగే అవకాశం ఉంది. అలాగే.. షూటింగులు నిలిపేయాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఏం ప్రకటిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: